నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్) | DSP | SagarEnglish  | తెలుగు 

నాన్నకు ప్రేమతో టైటిల్ సాంగ్ (లిరిక్స్)

ఏ కష్టమేదురోచ్చినా
కన్నీళ్ళు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం

ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో...
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో...
ఈ పాటతో... ఈ పాటతో....


Nannaku Prematho title song composed and written by RockStar DSP and the song sung by DSP and Sagar. The Song is dedicated to DSP's father Sathyamurthy garu.

Labels: , , ,