ఒక్కో నక్షత్రం (లిరిక్స్) ~ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు


Okko Nakshatram Song Lyrics
Song Title: Okko Nakshatram
Album: Seethamma Andalu Ramayya Sitralu[2016]
Starring: Raj Tarun. Arthana
Music: Gopi Sunder
Lyrics: Sri Mani
Singers: Karthik, Divya S.Menon

English  | తెలుగు 

ఒక్కో నక్షత్రం (లిరిక్స్)

ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆకాశం తుంచి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా
ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి
భరించి హరించి ప్రేమించే నీకోసం
నా ప్రాణంమేసి దాచనా
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా

ఏ మెరుపు పువ్వు నువ్వే చెలి
నీ చిలిపి నవ్వే గీతాంజలి
నీ ఊహే నాకు ఓ జాబిలి
నీ పలుకే గుండెల్లో జిలిబిలి
ఒక్కో వాయిద్యాన్ని ఒక్కో అల్లరి అడిగి
ఒక్కొక్కో ప నుంచి ఒక్కో పల్లవి తెచ్చి
ఆడించి పాడించి లాలించే నీకోసం
నా ప్రాణంమేసి దాచనా
ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా

కన్నుల్లో ఉండే కన్నీరులా
గుండెల్లో పొంగే సెలయేరులా
నీ కలల పూల తోటై ఇలా
ఏ కళలు అక్కర్లేనంతలా
పుట్టేదాక మళ్లీ నీకై చచ్చే ఆశ
చచ్చేదాక మళ్లీ నీతో బ్రతికే ఆశ
ప్రాణంలో ప్రాణంలా
మౌనంలో మౌనంలా
నా జీవితాన్ని పంచనా
ఒక్కో నక్షత్రం తెంచి ఒక్కో ఆకాశం తుంచి
ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా     [2x]

Back to Album

Labels: , , , ,